23. తద్విహీనం జారాణా మివ

23. తద్విహీనం జారాణా మివ

            గోపికాంగనల ప్రేమ భగవంతుని మాహాత్మ్యం తెలియనిదైతే అది వ్యభిచారమే అవుతుందేమో ? అని సంశయం.

            ఒకవేళ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను వారికంటే వేరుగా, కేవలం గొప్ప వాడిగా చూచినట్లైతే, ఆ శ్రీకృష్ణుని కీర్తిస్తూ, పూజిస్తూనే ఉండిపోయేవారు. వారి భక్తి అప్పుడు కాయిక, వాచిక భక్తి అయ్యుండేది. కాని ఆ గోపికాంగనలు శ్రీ కృష్ణుని హృదయాంతరంగలో పెట్టుకుని తన్మయులై ఉన్నారు కదా ! శరీరధారిగా అవతరించిన పరమాత్మను భగవంతుడిగా భావించి ఆలింగనం చేసుకుంటే అది జారత్వ మెలాగవుతుంది? అవతార్‌ మెహెర్‌ బాబాను భగవంతునిగా నమ్మిన స్త్రీ భక్తులు ఆయనను ఆలింగనం చేసుకోలేదా ? ఇరువురూ అజ్ఞానులైతే అది జారత్వ మౌతుంది గాని ఒకరు భగవంతుడైనప్పుడు రెండవ వాడైన అజ్ఞానిలో దివ్యత్వం ప్రకాశింప బడుతుంది. అప్పుడు ఆ భగవంతడు ఒక్కడే పురుషోత్తముడు ఇతరులు స్త్రీలైనా, పురుషులైనా సరే, అందరూ స్త్రీలతో సమానం.


   కనుక గోపికాంగనల భక్తిని కామంతో కూడినదిగా శంకించ నవసరం లేదు.