11. లోక వేదేషు తదనుకూలాచరణం తద్విరోధి షూదాసీనతా

11.    లోక వేదేషు తదనుకూలాచరణం తద్విరోధి షూదాసీనతా

            భక్తుడి లోకం భగవంతుడే. భగవత్ప్రీతి అతడికి సహజం. దీనికి ఆటంకం కలిగించే ఏ పని చేయడు. కాని ఏ పనీ చేయకుండా ఉండే పరిస్థితి కుదరదు. అందువలన వేరేదారి లేక తనకు లభించిన ఏకాగ్ర భక్తినే మరింత బలపరచు కుంటూ ఉంటాడు. అతడేమి చేసినా తనలో ఉండే భక్తికి అనుగుణంగానే ఉంటుంది. ఆ భక్తిని నిరంతరం పరిపోషించేవి గానే, అతని మాట, చేత ఉంటుంది. అందువలన ఊరకుండలేక భగవత్సేవ ప్రారంభిస్తాడు. ప్రాపంచిక విషయాలలోకి అతడి బుద్ధిపోదు. ఆ విషయాలు ఎదురైనప్పుడు ఉదాసీనత చెంది ఉంటాడు. చేయబడే కర్మ లౌకికమైనాసరే, వైదికమైనా సరే అది భగవత్ప్రీతిగా, భగవత్సేవగానే జరుగుతుంది. సర్వాధిష్ఠాన చేతనంతో కలిసిపోయి తనవరకు మాత్రం ఉదాసీనుడై ఉంటాడు.