10. అన్యాశ్రయాణాం త్యాగో-నన్యతా

10. అన్యాశ్రయాణాం త్యాగో-నన్యతా


            పరాభక్తుడికి అహంకారం ఉండదు. భగవత్ప్రేరణను బట్టి భక్తుడు ఆ భగవంతుని పరికరంగా పనిచేసే అహంకారం మాత్రం ఉంటుంది. పరాభక్తిలో స్థిరం కాకమునుపు భక్తుడి మనసు చిత్తవృత్తుల ప్రకారం నడిచేది. ఆ చిత్త వృత్తులను ఉదాసీనంగా చూడటం అలవాటైన పిదప ఇక వ్యాపారం అంటూ ఉండదు. అతడికి తెలియకుండానే వ్యాపారం జరిగిపోతూ ఉంటుంది. అందువలన ఆ పరాభక్తుడు కర్తగా ఉండడు, భోక్తగా ఉండడు. అతడికి ఇష్టాయిష్టాలు ఉండవు. సకల వ్యాపారాలకు భగవంతుడే అధిష్ఠానంగా ఉంటాడు. ఇతరమైన అధిష్ఠానం గాని, ఉద్దీపనం గాని లేకుండుటను అనన్యత అని నిర్ణయిస్తారు. అందువలన పరాభక్తుడు అన్యాశ్రయాన్ని త్యాగం చేసి ఉంటాడు.