13. అన్యథా పావిత్య్ర శంకయా

13. అన్యథా పావిత్య్ర శంకయా


            శాస్త్రాలను మార్చడం అనేది పరాభక్తుని బుద్ధిననుసరించి జరుగదు. ఒకవేళ అతడొక మేధావిగా శాస్త్రాల నభ్యసించి ఏవేవి మార్పులు చేస్తే బాగుంటుందని ఆలోచించి నిర్ణయిస్తే, అతడు పతనం చెందుతాడు. అది శాస్త్ర రక్షణ కానేరదు. స్వానుభవపూర్వకంగా ఉన్న దానినే అవసరమైనప్పుడు పరాభక్తుడి ద్వారా ఆ మార్పు చేస్తున్నట్లు అతడికి కూడా తెలియకుండానే లోక కళ్యాణార్థము జరిగేది శాస్త్ర రక్షణ. ఇది దైవీ ప్రేరణ వల్ల జరిగేది. బోధించే గురువులంతా, ఈ సత్యాన్ని గ్రహించి వర్తించాలని తెలియ చేస్తున్నారు.